Thursday 24th June 2021

విద్యుత్తు ఉద్యోగులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలి
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 4 - విద్యుత్తు ఉద్యోగులందరినీ కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ పవర్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బలగ సాయికృష్ణ డిమాండ్ చేశారు.  ప్రభుత్వానికి ఈ డిమాండ్ ను ఎప్పటి నుంచో వినిపిస్తున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శుక్రవారం ఆయన విద్యుత్తు ఉద్యోగులను, కాంట్రాక్టు ఉద్యోగులను  ఉద్దేశించి మాట్లాడారు. 
 విద్యుత్ ఉద్యోగులకు , వారి కుటుంబ సభ్యులకు కోవిడ్ టీకా యాజమాన్యమే ఇప్పించాలని డిమాండ్ చేశారు. కోవిడ్ తో చనిపోయిన వారందరికీ రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. విద్యుత్తు సంస్థలో పని చేస్తూ కోవిడ్ తో చనిపోయిన కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబానికీ కారుణ్య నియామకం కింద  ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బొబ్బిలిశాఖ అధ్యక్షులు బి.తేజేశ్వరరావు, కార్యదర్శి అల్లు శంకర్ రావు, ఇతర నాయకులు ఆర్.సతీష్ కుమార్, ఆర్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.