Thursday 24th June 2021

ఆ సిబ్బందిని రెగ్యులర్ చేయాలి
 

ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 4 -  ఆర్టీసీలో డైరక్టు రిక్రూట్ మెంట్ కోటాలో ఉన్న ఖాళీల్లో 30 మందిని తాత్కాలిక ప్రమోషన్లతో నియమించారని, వారిని ఆ పోస్టుల్లో రెగ్యులర్ చేయాలని ఎంప్లాయిస్ యూనియన్ నేత లు వై.వి.రావు, వలిశెట్టి దామోదరరావులు  కోరారు. ఈ మేరకు ఆర్టీసీ ఉపాధ్యక్షులు,  ఎండీలతో పాటు ముఖ్య కార్యదర్శికి లేఖలు ఇచ్చినట్లు తెలిపారు. వన్ టైమ్ పరిష్కారంగా వారిని క్రమబద్ధీకరించాలని కోరామన్నారు.  ట్రాఫిక్, మెయింటనెన్సు విభాగం నుంచి ఈ పదోన్నతులు కల్పించారని పేర్కొన్నారు.  ప్రస్తుతం కొత్త సర్వీసు నిబంధనల పేరుతో ఇప్పుడు వారిని ఆ పోస్టుల్లో రెగ్యులర్ చేయడం సాధ్యం కాదని మేనేజిమెంటు పేర్కొంటోందని అన్నారు. పీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన సబార్డినేట్ సర్వీసు నిబంధనల వల్ల ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులను సరి చేయాలని విన్నవిస్తున్నారు. త్వరలో ఆర్టీసీ మేనేజిమెంటు దృష్టికి ఈ విషయమూ తీసుకువెళ్తామని అన్నారు.