Saturday 19th June 2021

వైద్యుని చికిత్సకు రూ.1.50 కోట్లు మంజూరు హర్షణీయం
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
 ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కారంచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ యన్. భాస్కర్ రావు  కరోనాతో తీవ్ర అస్వస్థులయితే ముఖ్యమంత్రి రూ.1.50 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్  జిల్లా నాయకులు వినుకొండ రాజారావు అన్నారు. భాస్కరరావు ప్రభుత్వ వైద్యునిగా ప్రజలకు ఎంతో సేవలందించారని, ఆయన విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఊపిరితిత్తులు మార్చేందుకు ఇంత మొత్తం వెచ్చిస్తున్నారని అన్నారు. ఒంగోలులో ఉద్యోగుల ఫెడరేషన్  సమావేశం నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు.ఈ సమావేశంలో నాయకులు షేక్. నూర్ భాషా, ఎండ్లూరి చిట్టిబాబు,జె.రమేష్,  మాకినేని మురళి, యం.వి.నరసయ్య, పి. విజయ కుమార్, అంగలకుర్తి నరసింహం, డి ఈశ్వర్ రెడ్డి, పి. నవ కాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి