Saturday 19th June 2021

ఉద్యోగుల సాధారణ బదిలీలు ఇప్పట్లో లేవు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు. కామ్)
జూన్  7 - ఆంధ్రప్రదేశ్ లో  ఉద్యోగుల బదిలీలు ఇప్పట్లో  ఉండే దాఖలాలు లేవు.  ప్రస్తుతం  త్వరలో బదిలీలు ఉంటాయని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆర్థికశాఖ ఇందుకు సంబంధించిన ఫైలు సిద్ధం  చేసిందని, త్వరలో బదిలీల ఉత్తర్వులు రానున్నాయని ఆ ప్రచారం సాగుతోంది.
ఉద్యోగులు. న్యూస్ కు అందిన సమాచారం మేరకు అలాంటి ప్రతిపాదన ఏదీ ఆర్థికశాఖలో  సిద్ధం కాలేదని తెలిసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బదిలీలు ఆన్ లైన్ లో కూడా చేసే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్ జీ వో అసోసియేషన్ రాష్ర్ట అద్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో  సాధారణ బదిలీలు చేపట్టే అవకాశం లేదని వారు తేల్చి చెప్పారు. మరో వైపు గవర్నమెంట్ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి సైతం అలాంటి అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయని తెలిపారు.

ఎక్కువ మందిచదివినవి