Thursday 24th June 2021

త్వరలో కరోనా ప్రత్యేక సెలవు ఉత్తర్వులు
 

- ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి హామీ
- ఎన్ జీ వో సంఘం నేతల వెల్లడి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు. కామ్)
జూన్  7 -  కరోనా సోకిన ఉద్యోగులకు త్వరలో ప్రత్యేక సాధారణ సెలవు ఉత్తర్వులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి తెలిపారు. రాష్ర్ట ఎన్ జీ వో సంఘం నేతలు చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావు తదితరులు సోమవారం ధనుంజయ్ రెడ్డిని కలిశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించగా ఆయన హామీలు ఇచ్చారని ఎన్ జీ వో సంఘం నేతలు తెలిపారు.  ప్రస్తుతం సాధారణ బదిలీలు ఏవీ ఉండబోవని తెలిపారన్నారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగు డీఏలు వంటి అంశాలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ధనుంజయర్ రెడ్డి హామీ ఇచ్చారని ఎన్ జీ వో నేతలు వెల్లడించారు. కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు, పరిహారం చెల్లింపు తదితర అంశాలపై కూడా తాము చర్చించామని చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావులు తెలిపారు. కరోనాతో చనిపోయిన  ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లే రాష్ర్ట ప్రభుత్వమూ ఉత్తర్వులు ఇవ్వాలని ఎన్ జీ వో సంఘం నాయకులు ధనుంజయ్ రెడ్డికి విన్నవించారు. ఉద్యోగులదరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలని కోరారు.