Thursday 24th June 2021

విధుల బహిష్కరణకు జూనియర్ డాక్టర్ల నిర్ణయం
 

- ప్రభుత్వానికి నోటీసు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు. కామ్)
జూన్  7 - ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ జూనియర్ రెసిడెంటు డాక్టర్లు విధుల బహిష్కరణకు  నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి వారు సోమవారం నోటీసు అందించారు. క్రమేణా తమ ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు.  జూన్  9 నుంచి విధులు బహిష్కరణకు నిర్ణయించారు. తమకు ఆరోగ్య బీమా కల్పించాలని, పరిహారం వచ్చేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ ఇన్సెంటివ్ ఇవ్వాలని,  ఆస్పత్రుల్లో భద్రత ఏర్పాట్లు మరింత పెంచాలనేది వారు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. తమకు ఇచ్చే స్టయిఫండ్ లో టీడీఎస్ కోత కోయకుండా ఇవ్వాలని కోరుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి సమ్మె సైరన్ మోగిస్తూనే తమ కార్యాచరణను ప్రకటించారు.
ఇదీ వారి కార్యాచరణ...
జూన్ 9-  కోవిడ్ కు సంబంధం లేని విధుల బహిష్కరణ
జూన్ 10  - కోవిడ్ సంబంధిత విధుల బహిష్కరణ
జూన్ 11- కోవిడ్ సంబంధం లేని అత్యవసర విధుల బహిష్కరణ..
జూన్ 12 - కోవిడ్ సంబంధిత అత్యవసర విధుల బహిష్కరణ..