Thursday 24th June 2021

తక్షణమే పీఆర్సీ  జీవోలు ఇవ్వాలి


- తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 7-  తెలంగాణలో తక్షణమే పీఆర్సీ జీవోలు విడుదల చేయాలని, జూన్ నెలకు సంబంధించైనా కొత్త వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్  డిమాండ్ చేసింది.  లేకుంటే కరోనా తగ్గిన తర్వాత రాష్ర్ట వ్యాప్తంగా  ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొంది.  తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్(టిఈఏ) రాష్ట్ర కార్యాలయంలో  సోమవారం ఆ సంఘం నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సంపత్ కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు  డా.జి నిర్మల తదితరులు మాట్లాడారు. వారి డిమాండ్లు ఇలా ఉన్నాయి...
- కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలను ఆదుకోవాలి. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలి. వెంటనే ఆ కుటుంబంలో ఒకరికి వారి అర్హతను బట్టి తగిన ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
- కరోనా, బ్లాక్ ఫంగస్ వ్యాధులను సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నటు  ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు ఉచిత వ్యాక్సిన్ వెంటనే ఇవ్వాలి. వారికి 25శాతం  రిస్క్ అలవెన్సు , 10శాతం అదనపు వేతనం ఇవ్వాలి.
- కరోనా వచ్చిన ఉద్యోగులందరికీ 21 రోజుల ప్రత్యేక సాధారణ సెలవు ఇవ్వాలి.
- వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి క్వారంటైన్  లీవ్ ఇవ్వాలి.
- కరోనా  సోకిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరికీ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, కార్పొరేట్,  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా నగదు రహిత చికిత్సను అందించాలి.
- కరోనా , బ్లాక్ ఫంగస్ లను ఆరోగ్యశ్రీ , ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ల్లో  చేర్చాలి.
- వెంటనే వైద్యులను, నర్సులను మూడో వేవ్ ఎదుర్కొనేందుకు పెద్దఎత్తున నియమించాలి. భవిష్యత్తులో  శాశ్వత నియామకాల్లో వీరికి వెయిటేజి ఇవ్వాలి.