Thursday 24th June 2021

రెసిడెంట్ వైద్యులకు గౌరవ  వేతనం పెంపు
 

* ఉత్తర్వుల విడుదల


(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 8 -  ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ రెసిడెంట్ వైద్యులకు గౌరవ వేతనాన్ని పెంచుతూ రాష్ర్ట ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కళాశాలలు, ప్రభుత్వాసుపత్రుల్లో సేవలందిస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, పోస్టుగ్రాడ్యుయేట్ లకు, రెసిడెంట్ స్పెషలిస్టులకు గౌరవ వేతనాన్ని పెంచారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ  ఉత్తర్వులు ఇచ్చింది.
సీనియర్ రెసిడెంట్ వైద్యులకు రూ.70 వేలకు , రెసిడెంట్ డెంటిస్టులకు  రూ.65 వేలకు గౌరవం వేతనం పెంచారు. ఇప్పటికే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రకటన ఇచ్చింది. 2020 సెప్టెంబర్ నుంచి వీటిని అమలు చేయాలని నిర్ణయించింది.  రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు రూ. 85 వేలకు వేతనాన్ని పెంచారు.