Thursday 24th June 2021

కొత్త విద్యా విధానంలో కొన్ని మార్పులు అవసరం
 

- విద్యామంత్రికి ఏపీ ఉపాధ్యాయ సంఘం వినతి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 8-   రాష్ర్టంలో అమలు చేస్తున్న జాతీయ విద్యా విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్. శ్రావణ కుమార్ విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ కు విన్నవించారు. మంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం  ఒంగోలు లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి సంఘం తరపున అభినందనలు తెలిపారు.  పూర్వ ప్రాథమిక పాఠశాలల ను ప్రాధమిక పాఠశాలలో విలీనం చేయడం మంచి చర్య అని, 3,4,5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో  కలపకుండా ప్రాథమిక పాఠశాలలు యథాతథంగా కొనసాగించాలని కోరారు.