Thursday 24th June 2021

ల్యాబ్ రీసెర్చి శాస్ర్తవేత్తలకు వేతనం పెంపు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 8-   తెలంగాణలో వైద్యశాఖలో పని చేస్తున్న ల్యాబ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నో ఏళ్లుగా చాలీ చాలనీ జీతాలతో పనిచేస్తున్న ల్యాబ్ రీసెర్చ్ శాస్త్రవేత్తల  వేతనాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు నెలకు రూ.15 వేలుగా ఇస్తున్న వేతనాన్ని 60 వేల రూపాయలకు పెంచుతూ తెలంగాణ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.