తెలంగాణలో పి ఆర్ సి కి ఆమోదం

( ఉద్యోగులు. న్యూస్) ( ఉద్యోగులు. కామ్)

జూన్ 8-  తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి ఉద్యోగుల కొత్త పి ఆర్ సి కి ఆమోదం తెలియజేసింది.  మార్చి 22న శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్  ప్రకటనకు అనుగుణంగా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఫిట్మెంట్ 30 శాతం గా ఇంతకు ముందు నిర్ణయించారు. 2021  ఏప్రిల్ నుంచి నగదు రూపంలో   ప్రయోజనం అందించాలని  నిర్ణయించారు. 2021 జులై 1న కొత్త జీతం  ఉద్యోగులు అందుకుంటారు.  జూన్ నెల  జీతం తో పాటు కొత్త  వేతనం ఉద్యోగులకు  అందుతుంది.ఈ మంత్రివర్గ నిర్ణయం మంగళవారం బాగా పొద్దుపోయిన తర్వాత వెలుగులోకి వచ్చింది.
ఇవీ నిర్ణయాలు....!
1. నోషనల్ బెనిఫిట్ 1.7.2018  నుంచి అమలు
2.  మోనటరీ  బెనిఫిట్ 1.4.2020  నుంచి అమలు
3. 1.4.2021  నుంచి నగదు రూపంలో  ఇవ్వాలని నిర్ణయం
4. కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవు మంజూరు
5. పెన్షనర్లకు ఎరియర్స్ 36  వాయిదాల్లో చెల్లింపు
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రిమండలి.

ఎక్కువ మందిచదివినవి