9.5 లక్షల మంది ఉద్యోగులకు ఇది శుభవార్త
 

- ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం
- మొదటి నుంచి మేం చెబుతున్నాం
- టీఎన్జీవో నేతలు రాజేందర్, ప్రతాప్

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 9 -  తెలంగాణలో పీఆర్సీ అమలు, 30శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలుకు జీవోలు ఇచ్చేందుకు అనుమతించడం, మంత్రి మండలి ఆమోదించినందుకు టీఎన్జీవో కేంద్ర సంఘం  అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి  రాయకంటి ప్రతాప్ లు హర్షం వ్యక్తం చేశారు. సీపీఎస్  ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరియు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న 9.5 లక్షల మంది ఉద్యోగులందరికీ మేలు జరిగే లా రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని వారు పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టాలని చూసినా టీఎన్జీవో సంఘం ఉద్యోగులను ఐక్యంగా ఉంచింది టీఎన్ జీవో సంఘమేనని వారు పేర్కొన్నారు. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని ముందు నుంచి తాము చెబుతున్నామని వారు వివరించారు. ముఖ్యమంత్రిని కలుస్తూ తాము సమస్యల పరిష్కారానికి కృషి చేశామని అన్నారు.  కరోనా కష్టకాలంలో ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పని చేస్తున్నందుకు ఉద్యోగులకు అభినందనలు తెలియజేశారు.  రాబోయే కాలంలో మరింత అంకితభావంతో ప్రజలకు సేవలు అందిస్తూ  ముఖ్యమంత్రి  కలలుగన్న బంగారు తెలంగాణ సాధనకు మరింత అంకితభావంతో పని చేస్తామని రాజేందర్, ప్రతాప్ లు పేర్కొన్నారు.

ఎక్కువ మందిచదివినవి