ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు రద్దు ఉత్తమ నిర్ణయం
 

కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ 
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 9- ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి ,డాక్టర్ కొప్పిశెట్టి సురేష్  లు పేర్కొన్నారు. దీని వల్ల తెలంగాణలోని  4,73,967 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు మానసిక ఆందోళన నుంచి బయటపడ్డారని తెలిపారు. కోవిద్ 19 ప్రభావంతో   చికిత్సపొందుతూ చనిపోయిన కాంట్రాక్ట్ లెక్చరర్ల  కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వి. శ్రీనివాస్ ,కోశాధికారి నాయన శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శోభన్ బాబు తదితరులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని రాష్ర్ట విద్యామంత్రికి విన్నవించినట్లు పేర్కొన్నారు.

ఎక్కువ మందిచదివినవి