Thursday 24th June 2021

కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో కాంట్రాక్టు ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి
 

టీఎస్ యూటీఎఫ్ డిమాండ్
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 9-  కేజీబీవీలు, మోడల్ స్కూళ్ళకు అనుబంధంగా ఉన్న హాస్టళ్లల్లో   పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను  ఇప్పుడు రీ ఎంగేజ్ చేయవద్దని ఉత్తర్వులు ఇవ్వడం విచిత్రంగా ఉందని టీఎస్ యూటీఎఫ్ నాయకులు కె.జంగయ్య,చావా రవి ఒక ప్రకటనలో ఖండించారు. ఏప్రిల్ 16న వారిని తొలగించి ఏప్రిల్ 20 న తిరిగి నియమించాలని గతంలో  పేర్కొన్న వారు ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. జూన్ 16 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న క్రమంలో వీరిని తిరిగి నియమించాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు.