Saturday 19th June 2021

ఉపాధ్యాయ సమస్యలపై పోరాడుతూనే ఉంటాం
 

-ఎస్ టీ యూ 75వ వార్షికోత్సవంలో జోసెఫ్ సుధీర్ బాబు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 9-  స్వాతంత్ర్యం రావడానికి ముందే కఠిన ఆంక్షలు ఉన్నా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ర్టోపాధ్యాయ సంఘం ఆవిర్భవించిందని ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షులు జోసెఫ్ సుధీర్ బాబు పేర్కొన్నారు. సంఘం ఏర్పడి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా బుధవారం ఆయన ఎస్ టీ యూ రాష్ర్ట కార్యాలయంలో ఉద్యమ పతాకావిష్కరణ  చేశారు.  ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అన్ని యాజమాన్యాల, అన్ని కేడర్ల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎస్ టి యు ఆవిర్భవించిందని ఆయన అన్నారు.  ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం ప్రస్తుతం ప్రభుత్వం అనేక సంస్కరణలు తెస్తున్నప్పటికీ  విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మేలు జరిగే వాటి అమలుకు అంగీకరిస్తూనే వ్యతిరేకంగా ఉన్న వాటిపై సంఘం పోరాడుతోందన్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందని, అలాంటి సేవా దృక్పథం ఉన్న సంఘమే ఎస్ టి యూ  అని తెలిపారు. సి పి ఎస్ రద్దు, పీఆర్సీ , డీఏల సాధన, సర్వీస్ రూల్స్ సాధన, పదోన్నతులు మొదలగు సర్వీసు సంబంధమైన సమస్యల పరిష్కారమే  ధ్యేయంగా  పని చేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ వాణి ప్రధాన సంపాదకులు ఎస్. శ్రీనివాసరావు, ఇతర నాయకులు కె.జోజప్ప, ఎస్ కె ముస్తఫా, జెజె వెంకన్న కుమార్, ఎ. బాలాజీ, ఎన్.మధు బాబు, ఎమ్. వేణుగోపాల్, శివ నాగరాజు,ఒ. లక్ష్మయ్య, రాజారత్నం, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి