Thursday 24th June 2021

రాష్ర్టం అంతటా ఎస్ టీ యూ ఆవిర్భావ వేడుకలు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 9-  ఆంధ్రప్రదేశ్ రాష్ర్టోపాధ్యాయ సంఘం ఏర్పడి 74 ఏళ్లు పూర్తయిన 75వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా బుధవారం రాష్ర్టవ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. ఆ సంఘం  రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.జోసఫ్‌ సుధీర్‌బాబు, మల్లు రఘునాధరెడ్డిలు ఈ విషయం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, కోవిడ్ బాధితులకు భోజన ఏర్పాట్లు, అనాధ బాలలకు సహాయ కార్యక్రమాలు, ఇతర సహాయ కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. సంఘ వ్యవస్థాపకులు  వీణా విజయరామరాజు, వి.పి.రాఘవాచారి, పెర్నా శ్రీరామమూర్తి తదితర ఉపాధ్యాయ ఉద్యమ పితామహులు వారి జీవితాలను త్యాగం చేసి ఉపాధ్యాయులకు పీఆర్సీ, పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటే‌షన్, సెలవులు, డీఏ, హెచ్.ఆర్.ఏ తదితర ఎన్నో సౌకర్యాలు సాధించి పెట్టారన్నారు.  కడప జిల్లా సంఘం కార్యాలయంలో శాసనమండలి సభ్యులు  కత్తి నరసింహారెడ్డి , రాష్ట్ర అధ్యక్షులు   జోసఫ్ సుధీర్ బాబు   విజయవాడ లోని రాష్ట్ర సంఘం కార్యాలయంలో, ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాధరెడ్డి కడప జిల్లా యర్రగుంట్లలో, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా, మండల బాధ్యులు ఆయా ప్రాంతాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.