రెగ్యులర్ చేయాలని కోరుతూ కాంట్రాక్టు ఉద్యోగుల వినతిపత్రాలు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 9-  కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ కోవిడ్ టాస్క్ఫోర్స్ ప్రత్యేక ఆధికారి పి.రాజశేఖర్ రెడ్డి, యంపిడివో టి.సురేష్ బాబు, మండల వైద్యాధికారి డాక్టర్ బి.సునీల్ కుమార్ నాయక్ లకు  వినతిపత్రాలు సమర్పించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపాలని, సిఫార్సు చేయాలని ఏపీ డియస్సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల జెఏసి నాయకులు విన్నవించారు.  జేఏసీ రాష్ర్ట  కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథ రెడ్డి,జిల్లా కన్వీనర్ యస్. ఖాదర్ బాషా,యంపిహెచ్ఇవో యం.వేణుగోపాల్ రెడ్డి లు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆధికారి మాట్లాడుతూ కరోనా నియంత్రణలో ముఖ్యపాత్ర పోషించే కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని,ప్రజారోగ్యం పరిరక్షణలో ప్రాథమిక స్థాయిలో కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల అవసరం చాలా ఉందని నివేదికను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నాతాదికారులు తెలియజేస్తామని హమీ ఇచ్చారు.

ఎక్కువ మందిచదివినవి