Thursday 24th June 2021

ఉపాధ్యాయులు విద్యార్థులకు రోల్ మోడల్ కావాలి
 

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 10-  ఉపాధ్యాయులకు అవసరమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలని, విషయాలపై ఎప్పటికప్పడు అవగాహన పెంచుకుంటూ పరిశోధన , వినూత్న కార్యకలాపాల్లో తనను తాను నిమగ్నం చేసుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పేర్కొంది. ఉపాధ్యాయుడు విద్యార్థులకు రోల్ మోడల్ లా ఉండాలని విశదీకరించింది.   సరైన విద్యా విధానం కోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్సు ఎడ్యుకేషన్ కు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కొన్ని  సిఫార్సులు చేసింది.ఈ విషయాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ తెలిపారు.