పదోన్నతులు కల్పిస్తాం !! 

వ్యవసాయ శాఖ జెడి..

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 11-  పశ్చిమగోదావరి జిల్లాలో అర్హులైన వ్యవసాయ విస్తరణ అధికారులకు గ్రేడ్ వన్ పదోన్నతి కల్పించడానికి తగు ఆదేశాలు జారీ చేస్తానని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి గౌసియా బేగం అన్నారు .శుక్రవారం ఏలూరులోని వ్యవసాయ శాఖ జెడి కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షులు డి వేణు మాధవ్ రావు  జిల్లా సంఘం ప్రతినిధులతో కలిసి జె.డి గౌసియా బేగం కలిసి ఎన్నాళ్ల నుంచో పెండింగ్లో ఉన్న గ్రేడ్ వన్ పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు త్వరలో జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు గ్రేడ్ వన్ పదోన్నతి కల్పించనున్నట్లు జేడీ తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు .ఈ సందర్భంగా జెడి బేగం కు విస్తరణ  అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా సంఘ అధ్యక్షులు నెక్కంటి రాంబాబు ప్రధాన కార్యదర్శి శివ ప్రసాద్ శ్రీనివాస రావు లోకనాథ్ తదితరులు పాల్గొన్నారు.