Saturday 19th June 2021

ప్రతి పాఠశాలకు డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాలి
 

- వాచ్ మెన్, అటెండరూ అవసరమే
- విద్యామంత్రికి ప్రధానోపాధ్యాయుల సంఘం వినతి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 11-  ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలల్లో  ఒక డేటాఎంట్రీ ఆపరేటర్, అటెండర్, నైట్ వాచ్ మన్ పోస్టులు  ఏర్పాటు చేసి తక్షణమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.వి.నారాయణరెడ్డి, వి.శ్రీనివాసరావులు శుక్రవారం రాష్ర్ట విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ కు వినతి పత్రం పంపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతి పంచాయతీకి సచివాలయం ఏర్పాటు చేసి తగినంత మంది సిబ్బందిని నియమించారని,   ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీరు ను నియమించారని ఆ లేఖలో వారు ప్రస్తావించారు. రాష్ట్రం లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు , మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బడి - నాడు నేడు పథకం ద్వారా మౌలిక వసతులు కల్పించారని, పాఠశాలలకు విలువైన వస్తువులు సమకూర్చారని వారు పేర్కొన్నారు. పాఠశాలల ఆస్తులను పరిరక్షించేందుకు వాచ్ మెన్ ను నియమించాలని, వివిధ యాప్ ల నిర్వహణకు నిత్యం జిల్లా, రాష్ర్ట విద్యాశాఖ అధికారులు అడిగే సమాచారం ఎప్పటికప్పుడు పంపేందుకు వీలుగా కంప్యూటర్ ఆపరేటరు అవసరమని వారు పేర్కొన్నారు.   ఉపాధ్యాయులు తమ విలువైన బోధనా సమయాన్ని  ఈ సమాచారం పంపేందుకు వినియోగించకుండా ఉండేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్ అవసరమని వారు పేర్కొన్నారు.

ఎక్కువ మందిచదివినవి