Thursday 29th July 2021

ఒంగోలు కలెక్టర్ కు సచివాలయ ఉద్యోగుల వినతులు
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 14 - తమ సమస్యలు పరిష్కరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు ఆ జిల్లా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీరామ అజయ్  కుమార్, ఇతర నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. రెండేళ్ల ప్రొబెషనరీ పూర్తి చేసుకునే ప్రతి ఉద్యోగికి ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేసి పే స్కేలు వర్తింపజేయాలని విన్నవించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే బీమా వర్తింప జేయాలని కోరారు. సర్వీసు రిజిష్టర్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంతర్ జిల్లా పరస్పర అంగీకార బదిలీలకు ఆస్కారం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎవరైనా ఉద్యోగి మరణిస్తే కారుణ్య నియామకానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నపురెడ్డి. కిరణకుమార్ రెడ్డి, ఒంగోలు టౌన్ జనరల్ సెక్రటరీ  ఈదర  విజయ భాను తదితరులు పాల్గొన్నారు.