Thursday 29th July 2021

పీఆర్సీ జీవోల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయమే
 

- తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 16-  తెలంగాణ తొలి పి ఆర్ సి లో మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీన్ని వెంటనే సవరించి న్యాయం చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అని పేర్కొన్నా అది పక్కన పెట్టి కొత్త పీఆర్సీ జీవోల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అరకొర పెంచారని వారు విమర్శించారు. గత 16 నెలలు గా ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి కి ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు రాత్రింబవళ్ళు సెలవులే లేకుండా పని చేస్తే  ఇంత తక్కువగా వేతనాలు పెంచడం సమంజసం కాదన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగు ఉద్యోగులను వెంటనే యధావిధిగా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే  రాష్ట్రంలోని కలిసి వచ్చే అన్ని యూనియన్లు, అసోసియేషన్లతో  దశల వారీగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.