శానిటేషన్ కార్యదర్శుల సమస్యలపై చర్చ...
 

- త్వరలో ప్రభుత్వం దృష్టికి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 17-   శానిటేషన్ కార్యదర్శుల సమస్యలపై గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సంఘం (13/2020) నేతలు గురువారం విశాఖపట్టణంలో సమావేశమై చర్చించారు. రాష్ర్ట ఉపాధ్యక్షులు విప్పర్తి నిఖిల్ కృష్ణ ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భార్గవ్ సుతేజ్ లు చర్చించారు.  శానిటేషన్  సెక్రటరీల సమస్యలతో కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లిన కోర్ టీమ్ తో వీరి సమావేశం జరిగింది. వీరి సమస్యలపై నివేదిక రూపొందించి ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్  వెంకట్రామిరెడ్డికి పంపినట్లు సుతేజ్ వివరించారు. ప్రభుత్వం దృష్టికి శానిటేషన్ కార్యదర్శుల సమస్యలు తీసుకువెళ్తామని కోర్ టీం కు వివరించారు. శానిటేషన్ కార్యదర్శులకు పని వేళలు నిర్ణయించాలని, సచివాలయ కార్యదర్శులకు సాధారణ సెలవులు వర్తింపజేయాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది.   ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు రవి కుమార్ ,  శానిటేషన్ సెక్రటరీల తరపున పీటర్ , శ్రీకాంత్  , శ్రీనివాస్  మాట్లాడారు.