సమస్యల పరిష్కారానికి వైద్య ఉద్యోగుల వినతి
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 17-   సంగారెడ్డి జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అదనపు జిల్లా కలెక్టర్ ను, జిల్లా వైద్యాధికారిని కలిసి సంగారెడ్డి జిల్లా  మెడికల్, హెల్త్ ఐక్యవేదిక  నాయకులు డిమాండ్ చేశారు.  వారి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.  ప్రభుత్వం, రాష్ర్ట అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పరిష్కరించాలని వారు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక  నాయకులు రాష్ట్ర ప్రతినిధి   భరత్ సత్యనారాయణ, డాక్టర్ మజీద్ , డాక్టర్ రాజకుమార్ , డాక్టర్ రాజేశ్వేర్,  శ్రీవాణీ పి. ఉమాకాంత్,     జె.భాస్కర కమల తదితరులు పాల్గొన్నారు.