మరో ఏడాది పాటు 5 రోజుల పని దినాలు

- ప్రభుత్వం అంగీకారం

-వెంకట్రామిరెడ్డి వెల్లడి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జూన్ 26 - ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట సచివాలయంలోని, వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగించనున్నారు. మరో ఏడాది పాటు ఈ విధానం పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చేసిన విజ్ఞప్తిని సీఎం జగన్ సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో జారీ అవుతాయన్నారు.