ఆర్టీసీ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి
 

- రవాణా మంత్రికి ఎంప్లాయిస్ యూనియన్ నేతల వినతి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 29-  ఆర్టీసీ(పి.టి.డి.) ఉద్యోగులకు 2017 వేతనాల సవరణకు సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు వలిశెట్టి దామోదరరావు, వై.వి.రావులు డిమాండ్  చేశారు. ఈ మేరకు మంగళవారం వారు రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి వినతిపత్రం సమర్పించారు.  2019లో ఆర్టీసీ మేనేజ్ మెంటు గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఆర్టీసీ జేఏసీతో ఈ మేరకు ఒప్పందం  కుదుర్చుకున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. 2020 జులై లోగా బకాయిలు చెల్లిస్తామని పేర్కొన్నారని, వెంటనే చెల్లించాలని వారు కోరారు. పీటీడీ ఉద్యోగులదరికీ పాత పెన్షన్ స్కీం వర్తించేలా చూడాలన్నారు. కొత్తగా పి.టి.డి. ఉద్యోగులకు ఇచ్చిన సర్వీస్ నిబంధనల్లో అన్యాయాన్ని సరిచేయాలని విన్నవించారు. పెండింగులో ఉన్న కారుణ్య నియమకాల ప్రక్రియ చేపట్టాలని మంత్రిని కోరారు. కాంట్రాక్టు కండక్టర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.  2017 నుంచి 2021 వరకు పెండింగ్ ఉన్న లీవు ఎన్ క్యాష్ మెంటును అమలు చేయాలని, 2020 జనవరి నుండి పెండింగ్ లో ఉన్న సుమారు 11 శాతం డి.ఎ.ను మంజూరు చేయాలని  వారు డిమాండ్ చేశారు.