గ్రామ, వార్డు  సచివాలయ ఉద్యోగులకూ
రాయితీపై ఎలక్ర్టిక్ స్కూటర్లు 

- ప్రభుత్వ ఉత్తర్వులు
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 6-  రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీ ప్రాతిపదికన ఎలక్ర్టిక్ స్కూటర్లు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. వారూ స్కూటర్లు రాయితీపై కొనుగోలు చేసుకోవచ్చు. వాయిదా పద్ధతిన స్వచ్ఛందంగా ఉద్యోగులే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసుకోవాలని, ఇందుకు సంబంధించిన రాయితీ అందేలా చూస్తామని ప్రభుత్వం తన  ఆదేశాల్లో పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సంబంధించి ఎన్టీపీసీ సహా ఎస్సెల్  సంస్థలు ఉద్యోగులకు రాయితీ అందిస్తాయని ఆ  ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం  నుంచి ఎలాంటి సొమ్ములూ చెల్లించబోదు. ఉద్యోగుల నెలవారీ వేతనాల నుంచి ఆ మొత్తాన్ని వాయిదా రూపంలో మినహాయించుకునే అవకాశం కల్పిస్తుంది.  నెలకు రూ.2,500 వరకు మినహాయించుకుంటారు. ఈ మేరకు మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ స్కూటర్ల కొనుగోలుకు సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ  సహకరిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.