గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు
28, 29, 30 తేదీల్లో డిపార్టుమెంట్ పరీక్షలు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు
28, 29, 30 తేదీల్లో డిపార్టుమెంట్ పరీక్షలు
-ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 10- అమరావతి: ఈ నెల 28 నుంచి 30 వ‌ర‌కు గ్రామ‌,వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు డిపార్ట్మెంట్ ప‌రీక్షలు  నిర్వహించనున్నారు.  ఈ మేరకు ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.  ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో ఓటిపి ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీఆర్ లో   వ‌చ్చే యూజ‌ర్ ఐడితో అన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నెల 13 నుంచి 17 వ‌ర‌కు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  మొత్తం 100 మార్కుల‌కు పరీక్ష నిర్వహిస్తారు. అందులో 40 మార్కులు వ‌స్తేనే ప్రొబేష‌న‌రీకి అర్హులుగా  నిర్ధారిస్తారు. 
రెండేళ్ల కిందట నియామకాలు..
2021 అక్టోబర్ 2  నాటికి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. వీరికి ప్రొబెషనరీ ఖరారు చేయాలంటే డిపార్టుమెంట్ పరీక్ష పాస్ కావాలని నిర్ణయించిన ప్రభుత్వం. కరోనా కారణంగా డిపార్టుమెంట్ పరీక్షలు అన్ని విడతల్లో నిర్వహించలేకపోయిన ఏపీపీఎస్సీ. రాష్ట్ర వ్యాప్తంగా  15004 గ్రామ‌,వార్డు స‌చివాల‌యాల్లో 1.34 లక్షల మంది ప్రొబెషన్ కాలం పూర్తి అవుతోంది. డిపార్టుమెంట్ పరీక్ష పాస్ అయిన వారికే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ఎక్కువ మందిచదివినవి