Thursday 24th June 2021

సర్వీసు రిజిష్టర్లు ప్రారంభించాలి
 

గుంటూరు అడిషనల్ కమిషనర్ కు విన్నపం

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జూన్ 5 -  గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ ఎంప్లాయిస్ అసోసియేషన్  ( 361/2020 ) నాయకులు శనివారం అడిషినల్ కమిషనర్  నిరంజన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యదర్శులకు శిక్షణ ప్రారంభమైన రోజునే ఉద్యోగంలో చేరినట్లుగా ఎస్ ఆర్ లో నమోదు చేయాలని వారు కోరారు. అయిదు నెలలుగా జీతాలు ఆలస్యంగా వస్తున్నాయని, ఇక నుంచి ఒకటో తేదీనే వచ్చేలా చూడాలన్నారు. కార్యదర్శులందరికీ వెంటనే సర్వీసు రిజిష్టర్లు ప్రారంభించాలని కోరారు. స్పందించిన నిరంజన్ రెడ్డి సెక్షన్ అధికారులను పిలిచి జాయింట్ కలెక్టర్ కు వీటిపై లేఖ రాయాల్సిందిగా సూచించారు. ఈ  కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్,జిల్లా అధ్యక్షులు కంచర్ల నాగేశ్వరరావు,జీఎంసీ  కమిటీ ప్రధాన కార్యదర్శి సందీప్, జిల్లా ఉపాధ్యక్షులు సతీష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.