Thursday 24th June 2021

ఐసోలేషన్ కేంద్రానికి 
ఎల్ఐసీ ఉద్యోగుల సాయం


(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 7- కొరటాలసత్యనారాయణ విజ్ఞాన కేంద్రం, యూటీఎఫ్ సంయుక్తంగా తిరుపతిలోని బీటీఆర్  కాలనీలో నిర్వహిస్తున్న ఐసోలేషన్ కేంద్రానికి ఎల్ ఐ సీ ఉద్యోగులు సోమవారం సాయం అందించారు. రూ. 50 వేల విలువ చేసే  పీపీఈ కిట్లు, మందులు ఇతర సామాగ్రి వారు అందించారు. ఎల్ ఐ సి ఉద్యోగసంఘం నాయకులు ఈ.వెంకటముని, వై.కృష్ణకుమార్, జయవేలు, రమేష్ బాబు, సాయి సురేష్ లు మధ్యతరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్   కె.ఎన్.ఎన్. ప్రసాదరావు ద్వారా అందించారు. కొరటాల ఐసోలేషన్ కేంద్రం నిర్వాహకులు మల్లారపు నాగార్జున, పులిమామిడి యాదగిరిలకు  వారు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఎల్ ఐ సీ ఉద్యోగ సంఘం నాయకులు వెంకటముని మాట్లాడుతూ ఎల్ ఐ సీ ఉద్యోగులు ఎప్పుడూ సామాజిక బాధ్యతతో ఉంటారని అన్నారు.  ఈ మందులు, కిట్లు కాకుండా రూ.15 వేల ఆర్థిక సాయమూ అందించినట్లు చెప్పారు. మరో నాయకుడు ప్రసాదరావు మాట్లాడుతూ బ్యాంకులు, పోస్టల్, బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులను కూడా సాయానికి భాగస్వాములను చేస్తామని అన్నారు. కేంద్రం నిర్వహకులు మల్లారపు నాగార్జున మాట్లాడుతూ ఈ ఐసోలేషన్  కేంద్రానికి దాతల సాయం అవసరమని అన్నారు.