మెడికల్ రీఎంబర్స్మెంట్ గడువు జులై 31తోనే ముగిసిపోయింది
 

•    ఆ తర్వాత పొందిన చికిత్సలకు క్లెయింలు పంపొద్దు
•    జిల్లా ట్రెజరీలకు డీటీఏ ఆదేశం

ఆగస్టు 18:  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వఉద్యోగులు, పింఛనుదారులకు ఉద్దేశించిన మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకానికి పెంచిన గడువు ఈ ఏడాది జులై 31తోనే ముగిసిపోయిందని, అందువల్ల ఆ తేదీ తర్వాత జరిగే వైద్య చికిత్సకు సంబంధించిన క్లెయింలు పంపించవద్దని అన్ని జిల్లాల ట్రెజరీలకు రాష్ర్ట ఖజానా,  అకౌంట్ల విభాగం డైరెక్టర్ (డీటీఏ) ఎన్. మోహన రావు ఆదేశాలు జారీ చేశారు.  జులై 31వ తేదీనే చివరి గడువు పెంపు అని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి మళ్లీ గడువు పెంపు ఉత్తర్వులు వచ్చేవరకు ఎటువంటి క్లెయింలు పంపవద్దని స్పష్టం చేశారు.  సాధారణ వ్యాధులకు గుర్తింపు లేని ఆస్పత్రులలో చికిత్స పొందినట్లయితే అటువంటి క్లెయింలను కూడా పంపించవద్దని సూచించారు.  గుర్తింపు లేని ఆస్పత్రులలో చికిత్స పొందడానికి గల కారణాల పట్ల సంతృప్తి చెందితేనే, ఆ కారణాలను ప్రస్తావిస్తూ మాత్రమే అటువంటి క్లెయింలను పంపించాలని స్పష్టం చేశారు.