Thursday 24th June 2021

ఉద్యోగుల ఫెడరేషన్ నేత చొరవకు
ఔట్ సోర్సింగు ఉద్యోగుల సంఘం హర్షం

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జూన్ 10-   రాష్ర్టంలో ఔట్ సోర్సింగు ఉద్యోగులు పని చేస్తున్న పోస్టులను వదిలేసి మిగిలిన పోస్టులే భర్తీ చేయాలని ప్రభుత్వానికి విన్నవించిన ఏపీ జీఈఎఫ్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డికి ఔట్ సోర్సింగు ఉద్యోగుల యూనియన్ ధన్యవాదాలు తెలియజేసింది. ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఔట్ సోర్సింగు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి విన్నవించినందుకు ఆ సంఘం నాయకులు రాప్తాడు దయాకర్, షేక్ బాజీలు హర్షం వ్యక్తం చేశారు. వెంకట్రామిరెడ్డిని కలిసి అభినందించారు.ఈ వినతి లక్షా యాభై వేల మంది ఔట్ సోర్సింగు ఉద్యోగులకు ఆనందం కలిగించిందని వారు పేర్కొన్నారు.