మూడు కేటగిరీలుగా పంచాయతీ కార్యదర్శులు
 

- పీఆర్ సర్వీసెస్ అసోసియేషన్ నేతల డిమాండ్
- రాష్ర్ట కమిషనర్ కు వినతిపత్రం

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)


జూన్ 7-  ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ కార్యదర్శులను మూడు కేటగిరీలుగా తిరిగి వర్గీకరించాలని ఏపీ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ర్ట కమిషనర్ కు విన్నవించింది. ప్రస్తుతం అయిదు కేటగిరీలు ఉన్నాయని వివరించింది. ఈ మేరకు సోమవారం సంఘం ఛైర్మన్  కె.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పి.ఎస్.కుమార్, గౌరవ ఛైర్మన్ బుచ్చిరాజు తదితరులు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాల అమల్లో తాము ముందున్నామని, కరోనాతో చనిపోయిన  పీఆర్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం అందించాలని వారు కోరారు. పంచాయతీ కార్యదర్శి డీడీవో గా పరిగణించాలని కోరారు. గ్రామ కార్యదర్శులు, వాలంటీర్ల విధుల నిర్వహణ, జీతాలు డ్రా చేసేందుకు వారిని  డీడీవోలుగా గుర్తించాలని విన్నవించారు. పంచాయతీ కార్యదర్శులను కార్యనిర్వహణాధికారులుగా గుర్తించాలని కోరారు. జీవో ఎం ఎస్ నెంబరు 142 కింద మినిమం టైం స్కేలు వర్తింపజేయాలన్నారు. రికార్డు అసిస్టెంటు, ల్యాబ్, లైబ్రరీ అసిస్టెంటు లను జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నతీకరించాలని  సంఘం నాయకులు కమిషనర్ కు విన్నవించారు. డివిజనల్ పంచాయతీ అధికారులు అద్దె వాహనాలు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో నాలుగు సహాయ కమిషనర్ల పోస్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా పంచాయతీ అధికారుల కార్యాలయాల్లో పని చేస్తున్న డీఎల్ పీ వోలకు జాబ్ చార్టు రూపొందించాలన్నారు.

ఎక్కువ మందిచదివినవి