అతి త్వరలోనే పీఆర్సీ ఇస్తాం

-  2 రోజుల్లో ఉన్నతాధికారులతో భేటీ ఏర్పాటు చేస్తాం
-  ఉద్యోగ సంఘ నేతలకు సజ్జల హామీ
- బండి శ్రీనివాసరావు వెల్లడి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
అక్టోబరు 12 -   ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి, పీఆర్సీ తదితర అంశాలపై చర్చించేందుకు రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలకు ఈ మేరకు హామీ ఇచ్చారు.  అలాగే అతి త్వరలోనే  పీఆర్సీ అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశం ముగిసింది. అనంతరం నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్ జీ వో ల ఆధ్వర్యంలో జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ఆ విషయాలు ఇలా ఉన్నాయి...
- ఉద్యోగల సమస్యలపై రెండ్రోజుల్లో ఉన్నతాధికారులతో భేటీ ఏర్పాటు చేస్తామని సజ్జల చెప్పారు.
- ఆయన సానుకూలంగానే మాట్లాడారు. 
- పీఆర్సీ దసరాకు వస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పాం. అతి త్వరలోనే పీఆర్సీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
- ఈ రోజుకీ ఉద్యోగులకు ఇంకా పెన్షన్లు రాలేదని, జీతాలు రాలేదని చెప్పాం. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకూ డబ్బలు రావ డం లేదనీ వివరించాం.
- మా పై ఒత్తిళ్లు ఉన్నాయని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరాం.
- మా సమస్యల పరిష్కారానికి మధ్యాహ్నం  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలుస్తాం.