ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగుల సెటిల్ మెంట్స్ ఉత్తర్వుల జారీ పై ఈయూ హర్షం 
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 14 :  ఏపీఎస్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసి పీటీడీ  మార్చిన తర్వాత సర్వీసు నుంచి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన/చనిపోయిన/మెడికల్ అన్-ఫిట్/రాజీనామా/రిమూవల్ అయిన వారికి చెల్లించాల్సి టెర్మినల్  సెటిల్ మెంట్స్ చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఈయూ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది.  31.10.2021 లోగా ఆడిట్ చేయించి, ప్రభుత్వ ఫోల్డర్ లో చెల్లింపుల నిమిత్తం అప్ లోడు చేయాలని సంబందిత ఆర్టీసీ అధికారులకు మంగళవారం ఉత్తర్వులు జారీచేయడం హర్షం వ్యక్తం చేస్తున్నామని ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.రావు,రాష్ట్ర ప్రధానకార్యదర్శి పలిశెట్టి దామోదరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.