Thursday 24th June 2021

ఉద్యోగుల సహాయ సహకారాలతోనే
ఆర్టీసీ  అభివృద్ది చేస్తా

-యూనియన్ నేతలకు ద్వారకాతిరుమలరావు హామీ 
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 2 - ఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్ని కేటగిరీల ఉద్యోగుల సహాయ సహకారాలతోనే  సంస్థను అ భివృద్ధి చేస్తానని కొత్త వీసీ, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకాతిరుమల రావు అన్నారు. ఆయనను బుధవారం ఆర్టీసీ హౌస్ లో  పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కలిసి పుష్ఫగుచ్చం అందించారు.  సంస్థలో ఏ ఉద్యోగికి సమస్య వచ్చినా తాను పరిష్కారానికి ప్రయత్నిస్తానని అన్నారు. అందరం కుటుంబంలా పని చేద్దామని అన్నారు. ప్రజలకు మంచి రవాణా సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని అన్నారు.
     ఈ సందర్బంగా  ఎంప్లాయిస్  యూనియన్ నాయకులు మాట్లాడుతూ సంస్దలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటిని చర్చించేందుకు ఇ.యు రాష్ట్రకమిటీ అంతా వచ్చి త్వరలో కలుస్తామని తెలిపారు. కొత్త ఎండీని కలిసిన వారిలో ఏపి.పిటిడి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అద్యక్షులు వై.వి.రావు,రాష్ట్ర ప్రధానకార్యదర్శి వలిశెట్టి దామోదరరావు,కోశాధికారి యండి.ఏ.సిద్దిక్,రాష్ట్రకార్యదర్శి టి.వి.భవాని,హెడ్ ఆఫీస్ ఇ.యు కమిటీ ప్రతినిధి బి.వి.యస్.ప్రసాద్,కృష్టా రీజనల్ కార్యదర్శి వై.శ్రీనివాసరావు లు ఉన్నారు.