ప్రభుత్వం వెంటనే  పాఠశాలలు  తెరవాలి
 

•    టీపీటీఎఫ్ సిద్దిపేట అర్బన్ శాఖ డిమాండ్
ఆగస్టు 18: తెలంగాణ  ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్  (టీపీటీఎఫ్)  రాష్ట్ర శాఖ పిలుపుమేరకు  సిద్దిపేట అర్బన్ తహశీల్దార్  కార్యాలయం ముందు బుధవారం ఉపాధ్యాయులు నిరసన  ప్రదర్శన నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి  రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా  హాజరై మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  భౌతికంగా పాఠశాలలు తెరవాలని డిమాండ్ చేశారు.  ఆన్లైన్ విద్య ద్వారా పేద  వర్గాల పిల్లలు తీవ్రంగా  నష్టపోతున్నారన్నారు.  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, విద్యార్థులందరికీ  వ్యాక్సిన్ వేసి పాఠశాలలు తెరవాలని  డిమాండ్ చేశారు. ఐదు సంవత్సరాలుగా అంతర్జిల్లా , మూడు సంవత్సరాలుగా  ఉపాధ్యాయుల బదిలీలు  చేపట్టకపోవడం వల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా  నష్టపోతున్నందున  వెంటనే  బదిలీ ప్రక్రియ చేపట్టి  ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతుల ద్వారా  భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల  హేతుబద్ధీకరణ వెంటనే  ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు . సి పీ ఎస్ విధానాన్ని  రద్దు చేసి , పాత విధానాన్ని  అమలు చేయాలని డిమాండ్ చేశారు. పండిత్,  పీఈటీ పోస్టులు ఉన్నతీకరణ ను వెంటనే చేపట్టాలన్నారు.  వాటి ద్వరా పాఠశాలలకు  కేటాయించి ప్రమోషన్ల ద్వారా భర్తీ  చేయాలన్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించని  పక్షంలో ఈనెల 28న జిల్లా  కేంద్రంలో  నిరసన కార్యక్రమం  నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో  టీ పీ టీ ఎఫ్  నాయకులు  వజ్రమ్మ, శ్రీలత, తిరుపతి, జమీర్ మొహియుద్దీన్, విష్ణు, కృష్ణ , శ్రీనివాస్ ,పూర్ణ చందర్ , ఇంద్రసేనా రెడ్డి , భగవాన్ రెడ్డి  తదితరులు  పాల్గొన్నారు.