ప్రత్యక్ష తరగతులను వెంటనే ప్రారంభించాలి
 

•    టీపీటీఎఫ్ మహబూబాబాద్ మండల శాఖ డిమాండ్

 (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 

ఆగస్టు 18:  ఏడు సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీపీటీఎఫ్ రాష్ట్రశాఖ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మహబూబాబాద్ మండల శాఖ అధ్యక్షుడు బలాష రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కౌన్సిలర్ ఎస్. సైదుల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత 6 సంవత్సరాలుగా పదోన్నతులు, 3 సంవత్సరాలుగా బదిలీలు నిర్వహించలేదని తప్పుబట్టారు. దీనివల్ల ఉన్నత పాఠశాలలలో సబ్జెక్ట్స్ టీచర్స్ లేక విద్యార్థులకు నష్టం జరుగుతోందన్నారు.  కాబట్టి వెంటనే బదిలీలు, పదోన్నతులు  చేపట్టాలని డిమాండ్ చేశారు.  హేతుబద్ధీకరణ ఉత్తరులు ఉపసంహరించుకోవాలన్నారు.
టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి సోమ విష్ణువర్ధన్ మాట్లాడుతూ కోవిడ్-19 కారణంగా గత 2 విద్యాసంవత్సరాలలో చాలా  కాలం ఆన్లైన్ తరగతులతో సరిపెట్టాల్సి వచ్చిందని, ఇది ప్రత్యక్ష బోధనకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని అన్నారు. విద్యార్థులకు నష్టం కలగకుండా వెంటనే ప్రత్యక్షతరగతులు ప్రారంభించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి రాచకొండ ఉపేందర్, జిల్లా నాయకులు మంజుభార్గవి, జి. వెంకటేశ్వర్లు, ఉపేందర్, విద్యాసాగర్, సరిరాం, వసంత, శ్వేత, షమీం, వనజ,  కార్తిక్, కోడెం శ్రీనివాస్, ఎన్.శ్రీనివాస్ రావు, వెంకటేశ్వర్లు, లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.