బదిలీలు, పదోన్నతుల షెడ్యూలు ఇవ్వండి
 

విద్యామంత్రి సబితారెడ్డిని కలిసిన సంఘాల నేతలు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జూన్ 7-  ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్ట శాసనసభలో మార్చి 22న చేసిన ప్రకటనకు అనుగుణంగా తక్షణమే బదిలీలు, పదోన్నతుల షెడ్యూలు విడుదల చేయాలని జాక్టో, యూయస్సీసీ సంఘాల నేతలు కోరారు. రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిని  సోమవారం వారంతా కలిసి ఈ మేరకు విన్నవించారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పాత పది జిల్లాల ప్రాతిపదికన యాజమాన్యం వారీగా నిర్వహిస్తామని ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి(జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యుయస్పీసీ) నాయకులు విద్యాశాఖ మంత్రికి గుర్తుచేశారు. నాయకులు జి సదానందంగౌడ్, కె జంగయ్య, యు పోచయ్య, చావ రవి, బి కొండయ్య, కె అశోక్ కుమార్, జి రామకృష్ణ తదితరులు మంత్రిని కలిసి వివిధ సమస్యలపై చర్చించారు. వేసవి సెలవులు పూర్తి కావస్తున్నా బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయకపోవడం పట్ల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడైనా వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు.

ఎక్కువ మందిచదివినవి