Thursday 25th February 2021

బదిలీల తర్వాతే పదోన్నతుల  షెడ్యూల్ ఉండాలి

* పీఆర్సీ డాటవేతకే ఉపాధ్యాయులతో మైండ్ గేమ్


* టీ పీ ఎస్ హెచ్ ఎంఏ  విమర్శ 


 
పీఆర్సీ  వేతన హెచ్చింపు ప్రకటనను దాటవేయడానికి  ఉపాధ్యాయులతో ప్రభుత్వం  మైండ్ గేమ్ ఆడుతోందని  టీపీఎస్హెచ్ఎంఏ  రాష్ట్ర అధ్యక్షుడు
అడ్లగట్ట గంగాధర్, ప్రధాన కార్యదర్శి పద్మారావు విమర్శించారు.
ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించడంలో బంగారు తెలంగాణ అని ప్రకటించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నికల్లో ఒక్క పేజి లో వచ్చే ఏకీకృత సర్వీస్ రూల్స్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తెస్తుంది అని ఉపాధ్యాయుల కు ఏకీకృత సాధన లో ఉపాధ్యాయుల ను ఊరించి ఉద్యమ సమయంలో పబ్బం గడుపుకొని తెలంగాణ సాధన లో బాసటగా ఉన్న ఉపాధ్యాయ లోకాన్ని ప్రభుత్వం అధికారంలోకి రాగానే తుంగలో తొక్కిందన్నారు. పదోన్నతులు, నియామకాలు చేపట్టక 
విద్యాశాఖ నిర్వీర్యం అవుతొందన్నారు. మొక్కుబడిగా  పదోన్నతుల ప్రక్రియ ప్రకటన ఇచ్చారన్నారు. నియమ నిబంధనలు పాతర వేస్తూ.. ఇంతవరకు ఎప్పుడూ లేనివిధంగా జిల్లాలో బదిలీలు అంతర్ జిల్లా బదిలీలు  చేపట్టకుండా ప్రమోషన్ ప్రక్రియను  ఖ0డిస్తున్నామన్నారు.