Thursday 25th February 2021

పిఆర్సీ ఇతర సమస్యల కోసం దశల వారి ఆందోళన..

*23 న ధర్నాచౌక్ వద్ద నిరసన

(ఉద్యోగులు న్యూస్)

పిఆర్సీ  అమలు కోసం 30 నెలలు ఎదురు చూస్తున్నా ఇప్పటికి ప్రభుత్వం స్పందించి నందున ప్రభుత్వంపై దశల వారీ పోరాటం చేయాలని ఉపాధ్యాయులు పెన్షనర్లు పబ్లిక్ సెక్టార్ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. శుక్రవారం హైదరాబాదులో లో పెన్షనర్స జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించి 15 రోజులు గడిచినప్పటికీ పిఆర్సి సిఫార్సును పబ్లిక్ డొమైన్ లో ఉంచ లేదని ఈ నెల 6 ,7 తేదీల్లో సంఘాలతో చర్చలు జరపమని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వచ్చిన వార్తలు అమలు జరగలేదని స్టీరింగ్ కమిటీ ఆందోళన వెలిబుచ్చింది.. మీడియాలో వస్తున్న వార్తలతో క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొందని పిఆర్సీ ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 23న ఐక్యవేదిక కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టాలని సమావేశం నిర్ణయించింది ఆరోజు జిల్లా కలెక్టర్ మండల కేంద్రాలు విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.

అప్పటికి సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 15 లోపు రాష్ట్రస్థాయిలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కలిసి ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టాలని సమావేశం నిర్ణయించింది పిఆర్సీ  నివేదికను బయటపెట్టాలని ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ ఇవ్వాలని  2018 జులై 1 నుండి నూతన వేతనాలు అమలు చేయాలని  2018 మే 16 న సీఎం ఇచ్చిన హామీలు ఉత్తర్వులు ఇవ్వాలని  సి పి ఎస్ రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఆందోళన చేపట్టనున్నట్లు లక్ష్మయ్య తెలిపారు .ఈ సమావేశంలో లో  తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు సిహెచ్ సంపత్ కుమార్ స్వామి ఎస్టియు నాయకులు సదానందం గౌడ్ యుటిఎఫ్ నాయకులు జంగయ్య చావా రవి తదితరులు పాల్గొన్నారు.