తెలంగాణ వేతన సవరణ లో 21 నెలల నోషనల్

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జూన్ 11

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన ఉద్యోగుల నూతన వేతన సవరణకు సంబంధించి 21 నెలలపాటు ఏటువంటి  ఆర్థిక ప్రయోజనం లేకుండా నోషనల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు .నూతన వేతన సవరణకు సంబంధించి సుదీర్ఘంగా జీవో నెంబర్ 51 ఆర్థిక శాఖ జారీ చేసింది. ఇందులో కొత్త పీఆర్సీని 2018 జులై 1 నుండి అమలు చేస్తూ అప్పటినుండి 2020 మార్చి 31 వరకు ఎలాంటి  ఆర్థిక ప్రయోజనం  లేకుండా ఇరవై ఒక్క నెలలు నోషనల్ ఫిక్సషన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు .1.4 .2020 నుండి 31 3. 2021 వరకు బకాయిలను ఆ ఉద్యోగి పదవి విరమణ అనంతరం చెల్లిస్తారు. 1.4 .21 నుండి 31 .5 .21వరకు కేవలం రెండు నెలల బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నారు .పెరిగిన జీతాలు జూన్ 21 నుండి చెల్లిస్తారు. జూలై 1న తీసుకునే జూన్ జీతంలో కొత్త జీతాలు అందుకోవచ్చు.

ఎక్కువ మందిచదివినవి