Thursday 25th February 2021

పీఆర్సీ  ఇవ్వకుంటే ఫిబ్రవరిలో ప్రత్యక్ష   కార్యాచరణే

* 23న ధర్నాచౌక్   లో ఆందోళన

* ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల ఐక్యవేదిక  నిర్ణయం


ఉద్యోగులు న్యూస్

ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక  సమర్పించి 15 రోజులు దాటినా ఆ నివేదిక పెట్టలేదని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం విమర్శిస్తూ వెంటనే ఆ నివేదిక వెల్లడించాలని శుక్రవారం డిమాండ్  చేసింది. ఉద్యోగ సంఘాలతో ఈ నెల 6 7 తేదీల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చలు జరుపుతారని ప్రకటించి నా అది అమలు కాలేదని పేర్కొంది. 36 నెలలుగా తెలంగాణలో ఉద్యోగులంతా పి ఆర్ సి కోసం ఎదురుచూస్తున్నారని స్పష్టం చేసింది. వెంటనే పీఆర్సీ అమలు కోసం ఉద్యోగ సంఘాలతో చర్చను ప్రారంభించాలని డిమాండ్ చేసింది. ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ శుక్రవారం హైదరాబాదులో సమావేశమైంది.
  జే ఎ సి  చైర్మన్ కె లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. పిఆర్సీ సత్వర అమలు, ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈనెల 23న ఐక్యవేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు హైదరాబాద్ ధర్నా చౌక్ నందు ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టాలని, అదేరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు,  మండల కేంద్రాలు, విద్యాసంస్థల్లో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని  సమావేశం నిర్ణయించింది.
అప్పటికీ సమస్యల పరిష్కారం కాకుంటే ఫిబ్రవరి 15 లోపు రాష్ట్ర స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను కదిలించి ప్రత్యక్ష కార్యాచరణను చేపట్టాలని తీర్మానించారు.  ఈ  దిగువ సమస్యలను సత్వరమే పరిష్కరించి ఆందోళనను నివారించాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి మెమోరాండమ్ సమర్పించారు.


డిమాండ్స్:
 పిఆర్సీ నివేదికను వెంటనే పబ్లిక్ డొమైన్ లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
ఈ నెలాఖరులోగా సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ తో 1.07.2018 నుండి నూతన వేతనాలు అమలు చేయాలి.
 16 మే 2018 న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలి.
 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.
సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్దరించాలి. 1.09.2004 కు ముందు ఎంపిక ప్రక్రియ పూర్తై తర్వాత నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి.
ఈ సమావేశంలో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు సిహెచ్ సంపత్ కుమార్ స్వామి, సదానందం గౌడ్, కె జంగయ్య, పి కృష్ణమూర్తి, మైస శ్రీనివాసులు, ఎం రఘుశంకర్ రెడ్డి, చావ రవి, ఎం రాధాకృష్ణ, డివి రావు,వి శ్రీను నాయక్, ఎన్ యాదగిరి, టి విజయసాగర్, జి నిర్మల, నగేష్ యాదవ్, ఖమ్రొద్దీన్, ఎం ఎన్ కిష్టప్ప, అరుణమ్మ భౌతికంగా పాల్గొనగా, కె రమణ, వైయస్ శర్మ, బి కొండయ్య, చింతా రమేశ్, సుభాకర్ రావు, పి చంద్రశేఖర్, కె మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.